తెలుగు సినిమా జననం... తొలి అడుగులు...


తెలుగు సినిమా పుట్టింది 1931 లో, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ నిజానికి... మొదటి తెలుగు సినిమా రూపుదిద్దుకున్నది 1921 లోనే, అంటే మనం చెప్పుకునే 81 ఏళ్ళ చరిత్ర కంటే 10 ఏళ్ళు ఎక్కువే మన సినిమాకి. కాని ఆ పదేళ్లను పరిగణన లోకి తీసుకోకపోవటానికి కారణం అవి మూకీ సినిమాలు అనేమో. మన మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ, తీసింది పెద్దలు రఘుపతి వెంకయ్య గారు, వారి కొడుకు R S ప్రకాష్ గారు. అలా మొదలైన ప్రయాణం 10 ఏళ్ళు కొనసాగింది. తరువాత గజేంద్ర మొక్షణం, మత్స్యావతారం వంటి ఎన్నో మూకీలను తీసారు, కాకపోతే అప్పట్లో నాటకాల హవా విపరీతంగా ఉండటంతో అల తెర మీద మాటలు లేకుండా ఉరికే కదిలే బొమ్మలని చూసి మన తెలుగు ప్రజానీకం సహించలేకపోయారు, అదేదో వింత జరుగుతున్నట్లు మాయలు మంత్రాలూ జరుగుతున్నట్లు భావించేవారు. కొంత మంది అయితే అదంతా చుస్తే చెడు జరుగుతుంది అనుకునేవాళ్లంతా.

అలా అగమ్య గోచారంగా ఉన్న సినిమా పరిస్థితి 1929 లో కలకత్తాలోని ఎల్ఫిన్స్టోన్ ప్యాలెస్లో యూనివర్సల్ పిక్చర్స్ " ద మెలోడి ఆఫ్ లవ్ " అనే ఇంగ్లీష్ సినిమా వెయ్యటంతో ఒక మలుపు తిరిగింది. ఆ తరువాత టాకీల హవా మొదలైంది, నాటకాలు తగ్గుతూ వచ్చాయి. " షో బొట్ " అనే చిత్రం చూసి ముగ్దుడయ్యి ఆర్దెషిర్. ఎం. ఇరానీ గారు తొలి భారత టాకీ చిత్రం ఆలం ఆరా ని నిర్మించారు. 1931 మార్చి 14న ఈ సినిమా బాంబే మెజెస్టిక్ థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఇదే సినిమాకి మొట్ట మొదటి తెలుగు టాకీ సినిమా తీసిన హెచ్. ఎం. రెడ్డి గారు అసిస్టంట్ గ పని చేసారు. ఆ సినిమా ఏంటో మనందరికీ తెలుసు. ఆ సినిమా మొదలైన విధానం ఇంకా మరెన్నో ముచ్చట్లు త్వరలోనే మీతో పంచుకుంటాను.
అప్పటి దాక సెలవా మరి...

No comments:

Post a Comment