లవకుశ

లవకుశ

సుధీర్ఘ విరామం తరువత మళ్ళీ ఎందుకో ఈ బ్లాగ్ పై ఆసక్తి కలిగి రాయటం ప్రారంభించాలి అన్న ఆలొచనతో ముందుకు వెళ్ళే ప్రయత్నం...

ఇది మీరనుకుంటున్న లవకుశ కాదు. 1934 లో ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మించగా సి.పుల్లయ్య గారు చిత్రీకరించిన మొదటి లవకుశ చిత్రం.

Lava Kusa

Sudheerga viraamam taruvatha malli enduko ee blog pai asakthi kaligi rayatam prarambhinchali anna alochana tho munduku velle prayatnam...

Idi meeranukuntunna Lava Kusa kaadu. 1934 lo East India Film Company nirminchaga C.Pullaiah garu chitreekarinchina modati Lava Kusa chithram.






ముందు ఆర్టికల్లో 1931 లో మొదటి తెలుగు టాకీ సినిమా రిలీజ్ అయ్యింది అని తెల్సుకున్నాం కదా, అదేంటో ఆ చిత్రం వివరాలేమిటో చూద్దామా మరి...

Bhaktha Prahlada (1931)

Click here to read this article in Telugu

Mundu article lo 1931 lo modati telugu talkie cinema release ayyindi ani telsukunnam kada, adento aa chitram vivaralento chuddama mari...

తెలుగు సినిమా జననం... తొలి అడుగులు...


తెలుగు సినిమా పుట్టింది 1931 లో, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ నిజానికి... మొదటి తెలుగు సినిమా రూపుదిద్దుకున్నది 1921 లోనే, అంటే మనం చెప్పుకునే 81 ఏళ్ళ చరిత్ర కంటే 10 ఏళ్ళు ఎక్కువే మన సినిమాకి. కాని ఆ పదేళ్లను పరిగణన లోకి తీసుకోకపోవటానికి కారణం అవి మూకీ సినిమాలు అనేమో. మన మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ, తీసింది పెద్దలు రఘుపతి వెంకయ్య గారు, వారి కొడుకు R S ప్రకాష్ గారు. అలా మొదలైన ప్రయాణం 10 ఏళ్ళు కొనసాగింది. తరువాత గజేంద్ర మొక్షణం, మత్స్యావతారం వంటి ఎన్నో మూకీలను తీసారు, కాకపోతే అప్పట్లో నాటకాల హవా విపరీతంగా ఉండటంతో అల తెర మీద మాటలు లేకుండా ఉరికే కదిలే బొమ్మలని చూసి మన తెలుగు ప్రజానీకం సహించలేకపోయారు, అదేదో వింత జరుగుతున్నట్లు మాయలు మంత్రాలూ జరుగుతున్నట్లు భావించేవారు. కొంత మంది అయితే అదంతా చుస్తే చెడు జరుగుతుంది అనుకునేవాళ్లంతా.

అలా అగమ్య గోచారంగా ఉన్న సినిమా పరిస్థితి 1929 లో కలకత్తాలోని ఎల్ఫిన్స్టోన్ ప్యాలెస్లో యూనివర్సల్ పిక్చర్స్ " ద మెలోడి ఆఫ్ లవ్ " అనే ఇంగ్లీష్ సినిమా వెయ్యటంతో ఒక మలుపు తిరిగింది. ఆ తరువాత టాకీల హవా మొదలైంది, నాటకాలు తగ్గుతూ వచ్చాయి. " షో బొట్ " అనే చిత్రం చూసి ముగ్దుడయ్యి ఆర్దెషిర్. ఎం. ఇరానీ గారు తొలి భారత టాకీ చిత్రం ఆలం ఆరా ని నిర్మించారు. 1931 మార్చి 14న ఈ సినిమా బాంబే మెజెస్టిక్ థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఇదే సినిమాకి మొట్ట మొదటి తెలుగు టాకీ సినిమా తీసిన హెచ్. ఎం. రెడ్డి గారు అసిస్టంట్ గ పని చేసారు. ఆ సినిమా ఏంటో మనందరికీ తెలుసు. ఆ సినిమా మొదలైన విధానం ఇంకా మరెన్నో ముచ్చట్లు త్వరలోనే మీతో పంచుకుంటాను.
అప్పటి దాక సెలవా మరి...

Telugu Cinema Jananam... Tholi adugulu...


Click Here to read this article in Telugu

Telugu cinema puttindi 1931 lo, idi andariki telisina vishayam. Kaani nijaniki modati telugu cinema roopudiddukunnadi 1921 lo ne, ante manam cheppukune 81 yella charithra kante

Alochana...


Telugu cinema putti ippatiki 81 samvatsaralu avtondi... manaki cinema anedi migatha bhashala vaarilaa kevalam kalakshepam matrame kaadu. Cinema ni,  cinema ni malache vaarini aaradhinche vallentho mandi. Kontha mandiki idoka vyaparam, kontha mandiki vyapakam, kontha mandiki praanam. Ala praanam pette kontha mandi lo nenu lekapoina aa pichi pattina vallalo nenu okadine. Anduke maa ee pichi ki karanamaina mana telugu cinema ela puttindo ela peruguthoo vachindoo panchukundamanna chinna alochana, anduke ee blog...

Mee andari pichi naaku toduga untu munduki nadipistundani chinna aasa...

తెలుగు సినిమా పుట్టి ఇప్పటికి 81 సంవత్సరాలు అవుతోంది. మనకి సినిమా అనేది మిగతా భాషల వారిలా  కేవలం కాలక్షేపం మాత్రమే కాదు. సినిమా ని మలచే వారిని ఆరాధించే వాళ్ళెంతోమంది. కొంత మందికి ఇదొక వ్యాపారం, కొంతమందికి వ్యాపకం, కొంత మందికి ప్రాణం.  అలా ప్రాణం పెట్టే కొంతమందిలో నేనులేకపోయినా ఆ పిచ్చి పట్టిన వాళ్ళల్లో నేనూ ఒకడినే. అందుకే మా ఈ పిచ్చికి కారణమైన తెలుగు సినిమా ఎలా పుట్టిందో ఎలా పెరుగుతూ వచ్చిందో పంచుకుందామన్న చిన్న ఆలోచన, అందుకే ఈ బ్లాగ్.

మీ అందరి పిచ్చి నాకు తోడుగా ఉంటూ ముందుకి నడిపిస్తుందని చిన్న ఆశ.